Home  »  TV News  »  జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నా...ఆంటీ ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను

Updated : May 1, 2023

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 ప్రతీ వారం లాగే ఈ వారం షో కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఎంటర్టైన్ విషయం పక్కన పెడితే ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ కూడా తెలిసింది. ఈ వారం షోకి యాంకర్ రవి-విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ ఓంకార్ వీళ్ళతో ఎన్నో టాస్క్స్ ఆడించాడు. విష్ణుప్రియ బైక్ కూడా గెలుచుకుంది. ఇక ఎగ్స్ పగలగొట్టేటప్పుడు ఒక విషయం అడిగాడు. "ఇప్పుడు సెలబ్రిటీ క్రష్ ఉన్నారా" అని అడిగేసరికి "రీసెంట్ గా ప్రేమలో పడ్డాను. ఆయన వయసు నాకు సరిపోకపోవచ్చు అని మీరు అనుకుంటారు. ఆయనే జేడి. చక్రవర్తి. ఆంటీ ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళిపోతాను" అంది విష్ణుప్రియ.

"ఎందుకు నీకు ఆయనంటే ఇష్టం" అని యాంకర్ ఓంకార్ అడిగేసరికి "ఒక వెబ్ సిరీస్ కోసం 40 డేస్ మంగళూరులో ఆయనతో జర్నీ చేసాను. ఆ జర్నీలో పదో రోజు నేను ఫుల్ ఫ్లాట్ ఐపోయాను." అని చెప్పింది. "ఏ విషయంలో ప్రేమలో పడిపోయావ్" అని ఓంకార్ అడిగాడు. "చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ ఒకసారి అలా వాల్కనోలా పేలి 2022  నవంబర్ 25 వ తేదీ రాత్రి నాకు అర్ధమయ్యింది. నేను జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నాను" అనే విషయం తెలిసింది అని చెప్పింది. "ఆ ప్రేమ ఏమన్నా పెళ్లిగా మారే ఛాన్స్ ఉందా" అని అడిగేసరికి "నేనైతే ఆయనకు చెప్పాను. ఆయన రెస్పాండ్ అవలేదు."అని చెప్పింది. "రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నావా" అని రవి అడిగేసరికి " ఐ హోప్ సో..నా మనసులో ఏముందో ఆయనకు చెప్పేసాను. ఆల్రెడీ 28 ఏళ్ళు వచ్చేసాయి. తెల్ల జుట్టు కూడా వచ్చేస్తోంది. టైం వేస్ట్ చేయడం ఇష్టంలేక చెప్పేసాను" అంది. విష్ణుప్రియ ‘పోవే పోరా’  షోతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది.

తర్వాత టీవీ షోలు, ఈవెంట్లలో కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’, ‘చెక్ మేట్’ ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ అనే మూవీస్ లో నటించింది. ప్రస్తుతం ప్రైవేట్‌ ఆల్బమ్‌ సాంగ్స్‌తో బిజీగా ఉంటోంది. యాక్టర్ మానస్, ప్రియతో కలిసి "గంగులు" అనే సాంగ్ లో నటించింది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి "జరీ జరీ పంచెకట్టి" అంటూ చేసిన సాంగ్‌ కూడా బాగా హిట్‌ అయ్యింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.